Friday, August 29, 2014

Birthday బాతాఖాని

రెండు వారాల క్రితం, నా Birthday  రోజు, నా సతీమణి, మూడు ఏళ్ల కూతురు, హైదరాబాదు నుండొచ్చిన అమ్మ, నాన్న కలిసి చికాగోలో ఒక ఇటాలియన్ restaurantకు వెళ్లాము. అమ్మ ఫోర్క్ తో కుస్తీపడుతూ,  ఉండబట్టుకోలేక, "ఒరే రాము, ఒక్కప్పుడు నీ కూతురంత ఉండేవాడివి, time passes fast" అని అన్నది.  

నేను  "అమ్మా! అవును, 
గోదారల్లే ఉరకలేస్తున్న వయసు వరదలో జీవితం కొట్టుకోనిపోతుంది
కృష్ణమ్మ వోలె పరుగులెడుతున్న మనసు సరదాలని శరీరం తట్టుకోలేకపోతుంది" 

వెంటనే నా అర్ధాంగి "ఏంటో ఆ సరదాలు? హిమాలయాలు ఎక్కుదామనా? అమరావతి శిల్పాలు చెక్కుదామనా?" కొంటెగా ప్రశ్నించింది. 

"అవును Heroine, ఇంచుమించు అలాంటివే అనుకో.    
అమరనాథ్ లో మొక్కుదామని,
Andes ఎక్కుదామని, 
Tour de France తోక్కుదామని, some I can tell, some I cant, ఏవో ఉంటాయి మాకు సరదాలు"

ఒక్క క్షణం కూడా వ్యర్ధం చేయకుండా స్వప్న వెంటనే 
"Garage లో bulb మార్చాలి, వీలయితే నిచ్చెన అయినా ఎక్కండి
workout  అవుతుంది ఇంట్లో ఉన్న exercise బైక్ అయినా తొక్కండి" అన్నది. 

నేను కొద్దిగా నిరాశ నటిస్తూ "ఆకాశంలో స్వేఛ్చా జీవిలా ఎగురుతున్న నా విశాల హృదయ ఆలోచనలని పతంగిని లాగి దించినట్టు దించేసావు కదా hmm "

స్వప్న నొచ్చుకున్నట్టుగా చేస్తూ "నా ఉద్దేశం అది కాదండీ! ఆకాశంలో పక్షులు ఉంటాయి, నేలపై మనుషులు ఉంటారు. మీరు మేఘాలతో విహరిస్తే నేలపై పనులు కావుగా, అలా కిందకి దించాలని, భార్యగా నా భాధ్యత  అని పెళ్ళిలో పంతులు చెప్పారు. వినలేదా? !   

"ఆ! అవునా! నేను నిన్ను చూసి లొట్టలేస్తూ ఉంటే  మీ ఊరి పంతులు అలాంటి మంత్రాలు చదివి నాతో మూడు ముళ్ళు కట్టించాడు! వచ్చే జన్మలో పెళ్లి అంటూ చేసుకుంటే మంత్రాలు  తెలుగులోనే చదివించుకోవాలి."

అప్పడివరకు నవ్వుతున్న నాన్న కలిగించుకొని "రాము సరదాల గోల ఆపి కొంచెం సరళంగా చెప్పు, you are heading to middle age, Share your feelings?" అని అడిగారు. 

"నాన్న, English లో చెప్పాలంటే  Heart is Young, తెలుగు లో చెప్పాలంటే 
యెదలో యవ్వనములే 
చిలిపిగా జివ్వుమనెలె 
ఓ  మనసా నువు మూగపోకే 
నా వయసా నువు కరిగిపోకే"

"అవును, నిజమే ముప్పయిలో అయినా, అరవై లో అయినా ఆ మాట వర్తిస్తుంది" అంటూ అమ్మ నాన్న , నవ్వుతూ  మేము అందరం భోజనం పై దాడికి ఉపక్రమించాం..